లోక్ సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ఈ రోజు లోక్ సభలో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఉదయంనుంచే ఈ అంశంపై విపక్షాలు గొడవకు దిగటంతో సభ 12 గంటలవరకు వాయిదాపడింది. తిరిగి సమావేశం కాగానే విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమన వివరణ అవసరం లేదని ప్రధాని రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. దీంతో కాంగ్రెస్ నేత అంబికాసోని స్పందిస్తూ విపక్షాలు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాయో చూసుకోవాలని అన్నారు. ప్రధాని రాజీనామా చేసేది లేదని అన్నారు. దీంతో విపక్ష నేతలు వరుసగా నినాదాలు చేస్తూనే ఉండటంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.