లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
హుజూర్ నగర్ సెప్టెంబర్ 16 (జనం సాక్షి): లోక్ అదాలత్ ను కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో యూనియన్ బ్యాంక్, యస్. బి. ఐ. తదితర అన్ని బ్యాంకులకు సంబంధించిన పెండింగ్ కేసులను పరిష్కరించనున్నట్లు వివరించారు. కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ కేసును రాజీ చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.