లోటుపాట్లతో ఆంధ్ర బడ్జెట్‌

3

రాబడి తక్కువ వ్యయం ఎక్కువ

విభజనతో కోలుకోలేని నష్టం..యనమల

మొత్తం బడ్జెట్‌  – రూ. 1,13,049.00 కోట్లు

ప్రణాళికేతర వ్యయం – రూ.78,637.00 కోట్లు

ప్రణాళికా వ్యయం  –  రూ.34,412.00 కోట్లు

రెవెన్యూ లోటు –   రూ.14,244 కోట్లు

ఆర్థిక లోటు –   రూ.20,320 కోట్లు

హైదరాబాద్‌,మార్చి12(జనంసాక్షి): లోటు పాట్లతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్డెట్‌ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సభలో ప్రవేశపెట్టారు. విభజన తర్వాత రాబడి తక్కువై ఖర్చులెక్కువై ఇన్నాళ్లూ సమైక్య రాష్ట్రంలో ఉన్న మిగులు బడ్జెట్‌కు అసలు కారణాలు తేల్చేశారు. విభజనతో కోలుకోలేని నష్టం జరిగిందని అయితే అవాంతరాలను తట్టుకుని ముందుకు సాగాలన్నదే లక్ష్యంగా చెప్పుకున్నారు. రాజధాని నిర్మాణంతో పాటు ప్రాజెక్టుల పూర్తి చేస్తూ వ్యవసాయాన్ని పండగ చేయాలన్న బృహత్తర ప్రణాళికను ఆవిష్కరించారు. రాష్ట్ర విజభన వల్ల ఇచ్చిన హావిూల అమలు కాకపోవడం, విభజన సమస్యలు వెంటాడడం వల్ల ఆంధ్రప్రదేశ్‌  అనేక సమస్యలు ఎదుర్కొంటుందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో  చెప్పారు. విభజన వల్ల కలిగిన నష్టం పూడ్చలేనిదే అయినా అడుగు ముందుకు వేస్తామని ప్రకటించారు. గురువారం ఏపీ శాసనసభలో 2015-16 బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టారు. రాష్ట్ర బ్జడెట్‌ రూ.1,13,049 కోట్లుగా వెల్లడించారు. ప్రణాళికా వ్యయం రూ.34,412 కోట్లు గా నిర్ణయించినట్లు చెప్పారు. అంబేద్కర్‌ మాటలను గుర్తుచేస్తూ బ్జడెట్‌ ప్రసంగాన్ని యనమల ప్రారంభించారు. అంబేద్కర్‌ ఆకాంక్షించిన సమానత్వాన్ని ప్రతిబింబించేలా తన బడ్జెట్‌ ఉంటుందని  భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన, విభజన తీరుతో రాష్ట్రం సంక్లిష్టంగా తయారైందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు. విభజన కారణంగా ఆంధప్రదేశ్‌ మిగులు నుంచి లోటు రాష్ట్రంగా మారిందని తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర రుణభారం మరింత పెరుగుతుందని యనమల సూచించారు. ఏపీ నూతన రాజధాని నిర్మాణానికి రూ.3,168 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఆంధప్రదేశ్‌ నూతన రాజధానిని 33,252 ఎకరాల్లో నిర్మిస్తున్నామని ఆర్థిక మంత్రి యనమల తెలిపారు.  రైతుల సమ్మతితోనే నూతన రాజధానిని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 87 శాతం భూసవిూకరణ పూర్తి అయ్యిందని, 7 వేల ఎకరాలే ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని పేర్కొన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సీఆర్‌డీఏకు నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి యనమల వెల్లడించారు. ఆర్థికలోటు ఉన్నప్పటికీ భవిష్యత్‌ దార్శనికతతో ముందుకు సాగాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఆయన తన బడ్జెట్‌ ప్రసంగంలో అన్నారు. రెవెన్యూ వనరులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని మనకు వచ్చే ఆదాయం, వనరులు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు, జీతాలు మొదలైనవాటికి సరిపోతాయని బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు మిగిలిన రాష్టాల్ర మాదిరే ఎపిని కూడా చూడడం వల్ల నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రజలపై భారం పడకుండా, అదనపు వనరులను సవిూకరించడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్దికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని అన్నారు.7.7 శాతం అభివృద్ది సాధించామని ఆయన అన్నారు.సేవారంగంలో 8.8 శాతం, వ్యవసాయం 5.3 శాతం వృద్ది సాధించామని ఆయన తెలిపారు. పారిశ్రామిక రంగంలో ,సేవారంగంలో ఆదాయం తగ్గిందని అన్నారు.తలసారి ఆదాయం ఇప్పుడు తొంభై వేల రూపాయలు పైగా ఉండగా, 2018 నాటికి అది రెట్టింపు అయ్యే అవకాశం ఉందని మంత్రి యనమల చెప్పారు. ఒకపక్క డబ్బులు లేవని చెబుతున్న మంత్రి యనమల తలసరి ఆదాయం మాత్రం డబుల్‌ అవుతుందని అన్నారు. కేంద్రం నుంచి ఆశించిన నిధులు కూడా రావడం లేదని అన్నారు. ఆర్ధిక లోటును 17వేల కోట్లు, రెవెన్యూ లోటు ఏడువేల కోట్లకు పైగా ఉంటుందని ఆయన చెప్పారు. బడ్జెట్‌ లో గత ఏడాది కన్నా పెద్దగా మార్పు లేదని అన్నారు. గత ఏడాది 11823 కోట్లు , ఈ ఏడాది ఒకశాతం పెరుగుతుందని ఆయన చెప్పారు. ప్రణాళికేతర వ్యయం 78 వేల కోట్ల నుంచి 75 వేల కోట్లకు తగ్గించామని అన్నారు.  ఆంధప్రదేశ్‌ నూతన రాజధానిని 33,252 ఎకరాల్లో నిర్మిస్తున్నామని ఆర్థిక మంత్రి యనమల తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రైతుల సమ్మతితోనే నూతన రాజధానిని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 87 శాతం భూసవిూకరణ పూర్తి అయ్యిందని, ఈ మొత్తం సేకరించిన భూమిలో 7 వేల ఎకరాలే ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని పేర్కొన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సీఆర్‌డీఏకు నిధులు కూడా విడుదల చేయనున్నట్లు మంత్రి యనమల వెల్లడించారు. ఆందప్రదేశ్‌ కొత్త రాజధానికి ఈ ఏడాది బడ్జెట్‌ లో 3168 కోట్ల రూపాయల ను కేటాయిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి యనమల రామకృస్ణుడు ప్రకటించారు.బడ్జెట్‌ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు.విపత్తుల నిర్వహణకు 488 కోట్లు, ఐటి రంగానికి 370 కోట్లు, ఇంధన శాఖకు 4360 కోట్లు, నైపుణ్యాభివృద్దికి 360 కోట్లు,గోదావరి పుష్కరాలకు 1368 కోట్లు కేటాయించారు.సామాజిక చైతన్యం, సామర్ధ్యాల కల్పన,రుణ సదుపాయాలు తదితర లక్ష్యాల కోసం సాధికార మహిళా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వివిధ కార్యక్రమాల మధ్య సమన్వయం కోసం ,అదనపు వనరుల కోసం రాష్ట్ర ఆర్ధికాభివృద్ది బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని ఆయన చెప్పారు.  ఉద్యమాల వల్ల రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బంది ఏర్పడిందని అన్నారు.రాజధాని కూడా నిర్ణయించకుండా విభజన చేయడం దారుణమని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్ధికాభివృద్ది సాగించిందని యనమల తెలిపారు. మహిళా సాధికారిత, పేదరిక నిర్మూలన, ఆర్ధిక సంస్కరణలు దేశంలోనే చంద్రబాబుకు,ఎపికి పేరు తెచ్చాయని ఆయన అన్నారు. 2001లో మానవాభివృద్ది సూచికలో పదో స్థానంలో ఉండగా, 2008 నాటికి అది పదిహేనో స్థానానికి పడిపోయిందని అన్నారు. విభజన వల్ల రెవెన్యూ లోటు ఏర్పడిందని,ఆర్ధిక వనరులు దెబ్బతిన్నాయని యనమల చెప్పారు. ఆర్ధిక సంఘం సిఫారస్‌ ల తర్వాత కూడా లోటు కొనసాగుతోందని అన్నారు. రుణభారం వచ్చే కాలంలో మరింత పెరగనుందని మంత్రి యనమల చెప్పారు.లక్ష ఇరవై వేల కోట్ల మేర రాజధానికి నిధులు కోరాగా, రెవెన్యూ లోటుకింద 22 వేల కోట్లు మాత్రమే ఆర్ధిక సంఘం ఇచ్చిందని ఆయన చెప్పారు.   బడ్జెట్‌ లో మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు రూ. 195 కోట్లు కేటాయించారు. ఐటీ రంగానికి రూ. 370 కోట్లు కేటాయించింది. విపత్తు నిర్వహణకు రూ. 488 కోట్లు కేటాయించినట్టు ఆర్థికమంత్రి  ప్రకటించారు. ఉన్నత విద్యకు రూ. 3049 కోట్లు కేటాయించారు. మాధ్యమిక విద్యకు రూ. 585 కోట్లు, పాఠశాల విద్యకు 14,962 కోట్లు కేటాయించినట్టు  ప్రకటించారు. నైపుణ్యాల అభివృద్ధికి రూ. 360 కోట్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. బడ్జెట్‌లో వ్యవసాయ, సాగునీటి, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు.  ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించి.. పెట్టుబడి వ్యయాన్ని పెంచుతున్నట్టు తెలిపారు.   పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచాలన్న ఆలోచన లేదని యనమల పేర్కొన్నారు.అదే సమయానికి శాసనమండలిలో మంత్రి నారాయణ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గం సమావేశమై 2015-16 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది.పన్నుల ద్వారా సమకూరే ఆదాయం.. జీతాలు, రోజువారీ ఖర్చులకే సరిపోతోందని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం ఆంధప్రదేశ్‌కున్న ప్రత్యేక సమస్యల్ని పట్టించుకోలేదని ఆయన తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.  మిగిలిన రాష్టాల్రతో సమానంగా ఆంధప్రదేశ్‌కు  కేటాయింపులు జరిపారని, ఇవి రాష్ట్ర ప్రగతికి దోహదపడే స్థాయిలో లేవని యనమల అభిప్రాయపడ్డారు.  ఆంధప్రదేశ్‌ బడ్జెట్లో పలు రంగాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. బడ్జెట్‌ కేటాయింపుల్లో డ్వాక్రా రుణాల మాఫీ ఊసే ఎత్తలేదు. అలాగే సాగునీటికి నిధుల కేటాయింపుల్లో ఈసారి ప్రభుత్వం భారీగా కోత విధించింది. మరోవైపు గిరిజన, బీసీ సంక్షేమానికి అరాకొరా నిధులు కేటాయించింది.  గత ఏడాది కన్నా ఈసారి గృహ నిర్మాణాని, స్త్రీ,శిశు సంక్షేమానికి, ఆరోగ్య రంగం, కి నిధులు పెంచింది. కాగా 2018  మార్చి నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మరోవైపు పోలవరం కంటే ముందే పట్టిసీమ ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. సీఆర్డీఏ నిధుల అంశాన్ని బడ్జెట్‌ ప్రసంగంలో యనమల పేర్కొనలేదు.

బడ్జెట్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

రాష్ట్ర బడ్జెట్‌ రూ.1,13,049 కోట్లు

రాజధాని నిర్మాణానికి రూ.3,168 కోట్లు

నీటిపారుదలశాఖకు రూ.5,258 కోట్లు

రహదారులు-భవనాల శాఖకు రూ.2,960 కోట్లు

పాఠశాల విద్యా శాఖకు రూ. 14,962 కోట్లు

పంచాయతీ రాజ్‌ శాఖకు రూ.296 కోట్లు

గ్రావిూణాభివృద్ధి శాఖకు రూ. 8,212 కోట్లు

ఉన్నత విద్యకు రూ.3,049 కోట్లు

ఇంటర్‌ విద్యకు రూ.585 కోట్లు

వైద్య ఆరోగ్య శాఖకు రూ. 5,728 కోట్లు

చేనేత-జౌళిశాఖకు రూ.46 కోట్లు

వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ.45కోట్లు

స్త్రీ, శిశు సంక్షేమశాఖకు రూ.1,080 కోట్లు

మైనార్టీ సంక్షేమానికి రూ.379 కోట్లు

బీసీ సంక్షేమశాఖకు రూ.3,231కోట్లు

గిరిజన సంక్షేమశాఖకు రూ.993 కోట్లు

రాజధాని నిర్మాణానికి రూ.3,168 కోట్లు

రాజధాని నిర్మాణానికి రూ.3,168 కోట్లు

రహదారులు-భవనాల శాఖకు రూ.2,960 కోట్లు

ఏపీ బ్జడెట్‌లో పరిశ్రమల శాఖకు రూ.637 కోట్లు

కార్మికశాఖకు రూ.281 కోట్లు

ఐటీశాఖకు రూ.370 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ.637 కోట్లు

మౌలిక సదుపాయాలు, పెట్టుబడులకు రూ.195 కోటు

రవాణా శాఖకు రూ.122 కోట్లు

విపత్తు నిర్వహణకు రూ.488 కోట్లు

అటవీ శాఖకు రూ.284 కోట్లు

పోలీసుశాఖకు రూ.4,062 కోట్లు

గనులు, భూగర్భశాఖకు రూ.27కోట్లు

పర్యాటక సాంస్కృతిక శాఖకు రూ.339 కోట్లు

నైపుణ్యాల అభివృద్ధికి రూ.360కోట్లు

రెవెన్యూ శాఖకు రూ. 14,029 కోట్లు

గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్లు

విద్యుత్‌ శాఖకు రూ.4360 కోట్లు

తమిళనాడు తరహాలో ఎక్సైజ్‌ విధానం అమలు చేసుకుంటూ, 2050 నాటికి ప్రపంచంలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని యనమల ప్రకటించారు.  2029 నాటికి దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ ఉంటుందన్నారు.  వ్యవసాయ బ్జడెట్‌ను మంత్రి పుల్లారావు ప్రవేశపెడతారన్నారు.