వంతెనపై నుండి బస్సు బోల్తా..ఒకరు మృతి..

ఆదిలాబాద్ : జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వంతెన పై పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే జిల్లాలోని కాగజ్ నగర్ నుండి ఓ ఆర్టీసీ బస్సు బెజ్జూరుకు వెళుతోంది. 30 మంది ప్రయాణీకులతో వెళుతున్న ఈ బస్సు నామానగర్ వద్ద ఎర్రవాగు వంతెన పై నుండి కిందకు పడిపోయింది. దీనితో బస్సులో ఉన్న 18 మందికి గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగజ్ నగర్ లో ప్రైవేటు ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. బస్సు ఎలా ప్రమాదానికి గురైందో తెలియరాలేదు. vyfziyq5