వందసీట్లన్న వారు ఎందుకు భయపడుతున్నారు?
మయుందస్తుకు ఎందుకు వెళుతున్నారో చెప్పరేం: కటకం
కరీంనగర్,సెప్టెంబర్ 27(జనంసాక్షి): మహాకూటమితో అధికార టిఆర్‌ఎస్‌లో వణుకుపుడుతోందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. తాము ఎవరితో కూటమి కడితే టిఆర్‌ఎస్‌కు ఎందుకని, వంద సీట్లు గెలుస్తామన్న వారు ఎందుకు భీతిల్లుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వంద సీట్లు మావే అనిచెప్పుకుంటున్న సిఎం కెసిఆర్ 9 నెలల ముందే ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేసారో ఇప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వారికి పాలన చేతకాదన్న విమర్శలను కేసీఆర్ నిజం చేశారని అన్నారు. పాలనలో తామే బెస్ట్ అని నిరూపించామన్న కెసిఆర్ ఎందుకు పారిపోయారని అన్నారు. కటకం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. కేటీఆర్ ముఖంలో మొదటిసారి ఓడిపోతామన్న భయం కనిపించిందన్నారు. అందుకే ఒక్క ఓటుతోనైనా గెలిపించానలి ప్రజలను కోరుతున్నారని ఎద్దేవా చేశారు. హరీష్ రావు కూడా ఒక్క ఓటుతో అయినా ఓడించడని అంటున్నారని అన్నారు. కెజి టూ పిజి, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, మిషన్ భగీరథ నీళ్లు తదితర హావిూలను ఎందుకు అమలు చేయలేదన్నారు. అమలు చేసేందుకు తగిన సమయం ఉన్నా ఎందుఉ ముందస్తుకు వెళుతున్నారని అన్నారు. ఎంఐఎం, బిజెపిలతో లోపాయకారి పొత్తులు కుదుర్చుకుని కాంగ్రెస్‌ను విమర్శిస్తే ప్రజలు గమనించరని అనుకుంటే పొరపాటన్నారు. ఇచ్చిన హావిూల మేరకు ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణం జరగలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయంలో ఒకటో తేదిలోగా పెన్షన్లు ఇచ్చేవాళ్లమని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని దుయ్యబట్టారు. సోనియా గాంధీని విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. తమది ప్రజా కూటమి అని.. దానికి ఓటమి లేదన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని పేర్కొన్నారు.
కటకంపై పోలీసుల కేసు నిబంధనలు ఉల్లంఘించి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించినందుకు డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయంపై కరీంనగర్ ఒకటవ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌కు వచ్చిన సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ ఘనస్వాగతం పలికి ర్యాలీ నిర్వహించింది. అయితే ర్యాలీ కోసం అనుమతి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి కూడలి వద్ద వాహనాలను నిలిపి రోడ్‌షో నిర్వహించడంతో ట్రాఫిక్‌కు గంటల తరబడిగా ఇబ్బంది తలెత్తిన కారణంగా మృత్యుంజయంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
——
—————–
————
————–
————
————–
————–
————-
————–