వంద నిమిషాలు సాగిన అలెగ్జాండర్‌ సాంఘిక నాటిక

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8:  భారత దేశ నాటక రంగ చరిత్రలోనే కాక ప్రపంచంలోనే ఇంత వరకు ఎవ్వరు చేయని వంద నిమిషాలపాటు ఒకే పాత్రగల అలెగ్జాండర్‌ సాంఘీక నాటికను విజయవంతం చేయాలని ఆ పాత్రధారి, సినీ నటుడు జయప్రకాష్‌ రెడ్డి కోరారు. శనివారం నిజా మాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిటైర్డ్‌ ఆర్మీ మేజర్‌ వర్తమాన రాక్షస గనంపై సమరభేరి మ్రోగించిన అలెగ్జాండర్‌ నాటిక ఆదివారం రాత్రి 7గంటలకు స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ప్రదర్శిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రదర్శనను 26 ప్రదేశాల్లో ప్రదర్శించానని నిజామాబాద్‌లో 27వ ప్రదర్శన అని ఆయన అన్నారు. రంగ స్థలంపైనే తాను అన్ని నేర్చుకొని సినిమా రంగాల్లోకి అడుగుపెట్టానని  తెలిపారు. అలెగ్జాండర్‌ నాటికి చారిత్రాత్మికం కాదని, సామాజిక స్పృహ కలిగిన ఈ నాటికను పూసల రచించారని తెలిపారు. ఈ నాటికలో తెరపై కనిపించని గాత్ర దారులు కోట శ్రీనివాస్‌రావు, అల్లరి నరేష్‌, రఘుబాబు, కొండవలస, చిరంజీవి భరత్‌, రావికొండల్‌ రావు, బొమ్మాళి రవి, సాయికుమార్‌, ప్రముఖ యాంకర్లు, సుమా, ఝాన్సీ, తెలంగాణ శకుంతల స్వరాలు ఉంటాయని వివరించారు. ప్రదర్శన ఉచితమని పెద్ద ఎత్తున ఈ ప్రదర్శనను తిలకించాలని విలేకరుల సమావేశంలో పాల్గొన్న మూడ నాగభూషనం గుప్త, ఎస్‌.ఎస్‌.కుమార శర్మ కోరారు. విలేకరుల సమావేశంలో పూసల , నరాల సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.