వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది నువ్వే
స్పష్టత ఇవ్వకుండా తెలంగాణలోకి ఎట్లొస్తవ్
మీ కోసం కాదు.. అది నీ కోసం : నాగం
హైద్రాబాద్, అక్టోబర్21(జనంసాక్షి):
వచ్చిన తెలంగాణను అడ్డుకొన్నది బాబేనని తెలంగాణ నగారా సమితి అధ్యక్షులు నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు..బాబు పర్యటన సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఉధృతమైన ఉద్యమం మూలంగా 2009 డిసెంబర్ 9న కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేసిందని, అయితే దాన్ని చంద్రబాబే అడ్డుకున్నాడని ఆయన తెలిపారు.. తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతం అంటూ యువకుల ఉసురుపోసుకున్న బాబు ఇపుడు ఏ మొకం పెట్టుకొని తెలంగాణలో అడుగుపెడుతున్నాడని నిలదీశారు. తెలంగాణపై వైఖరి స్పష్టం చేయకుండా తెలంగాణలోకి ఎట్ట అడుగుపెడతవని ఆత్రహం వ్యక్తం చేశారు…చేపట్టిన యాత్రను మీకోసం కాదు నీకోసం అని పేరు మార్చుకోవాలని సూచించారు..ఇక్కడి ప్రజల మనోభావాలను ఆయన గౌరవించాలని లేకుంటే టీడీపీ పుట్టగతులుండవని ఆయన స్పష్టం చేశారు…తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాకే తెలంగాణలో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు..