వచ్చే నెల నుంచి ఇళ్లకు ఉచిత విద్యుత్‌

` 200 యూనిట్ల వరకు అమలు చేస్తాం
` ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటూ రాదు
` కాళేశ్వరం అక్రమాలపై విచారణ నడుస్తోంది
` అవినీతిపరులు జైలుకెళ్లక తప్పదు
` మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
` ఎన్నికల హామీలను అమలు చేస్తున్నాం
` మేనిఫెస్టో కమిటీ భేటీలో మంత్రి శ్రీధర్‌ బాబు
హైదరాబాద్‌(జనంసాక్షి):కరెంట్‌ బిల్లులపై రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హావిూ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రెండు వందల యూనిట్లలోపు కరెంట్‌ బిల్లు వచ్చే వారికి ఫిబ్రవరి నెల నుంచి ఉచిత్‌ విద్యుత్‌ హావిూ అమలులోకి వస్తుందని వెల్లడిరచారు. నగరంలోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ మంగళవారం సమావేశమైంది. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డితో పాటు సభ్యులు శ్రీధర్‌ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ హావిూల అమలుపై చర్చించిన కమిటీ.. ఉచిత విద్యుత్‌ అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. వంద రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హావిూలను నెరవేర్చుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం హావిూల అమలుపై గాంధీ భవన్‌లో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను తప్పకుండా నెరవేర్చుతామన్నారు.వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హావిూని అమలు చేస్తామన్నారు. ఇప్పటికే రెండు హావిూలను అమలు చేశామని పేర్కొన్నారు. హావిూల అమలుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతామని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హావిూలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి. గత ప్రభుత్వం కారణంగా లాభాల్లో ఉన్న రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, నిరుద్యోగ భృతి లాంటి ఎన్నో హావిూలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించిందన్నారు. త్వరలో జరగనున్న లోక్‌ సభ ఎన్నికల్లో కేసీఆర్‌ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. లక్ష కోట్లను కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట నీళ్లపాలు చేశారని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని తాను వదులుకున్నానని, అలాంటి తనపై బీఆర్‌ఎస్‌ నేత జగదీశ్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న భయంతోనే తనపై దుష్పచ్రారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా ఉచిత విద్యుత్‌ హావిూ అమలుపై బీఆర్‌ఎస్‌ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొత్త ఏర్పాటైన రోజు నుంచే ఎన్నికల హావిూలను అమలు చేయాలని మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావులు.. సీఎం రేవంత్‌ రెడ్డిని, మంత్రి కోమటిరెడ్డిని డిమాండ్‌ చేస్తున్నారు. రైతుబంధు నిధుల విడుదల తక్షణమే జరపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన బీఆర్‌ఎస్‌ నేతలు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ హావిూ ఏమైందని వీలు చిక్కినప్పుడల్లా నిలదీస్తున్నారు. అయితే గత ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రాజెక్టులు, కరెంట్‌ పై విధివిధానాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత సాధ్యమైనంత త్వరగా ఉచిత విద్యుత్‌ ను అమలు చేసి అక్కాచెª`లలెమ్మలకు ఆర్థిక భారం తొలగిస్తామని చెబుతూనే ఉన్నారు. ఒకవేళ సాధ్యమైనంత త్వరగా ఉచిత్‌ విద్యుత్‌ పై ప్రకటన చేయకపోతే, రాష్ట్రం నుంచి కరెంట్‌ బిల్లులను ఢల్లీిలోని సోనియా గాంధీ ఇంటికి పంపించే ఉద్యమాన్ని చేపడతామని కేటీఆర్‌ ట్వీట్లు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి నెల నుంచి రెండు వందల యూనిట్ల లోపు వారికి ఉచిత విద్యుత్‌ అందిస్తామని ప్రకటన చేసింది.
కాళేశ్వరం అక్రమాలపై విచారణ నడుస్తోంది
అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా ఉన్న మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డికి జైలు తప్పదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. కేటీఆర్‌, కవితకూ కారాగారం తప్పదని పేర్కొన్నారు. మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. భూ దోపిడీ దారుడు జగదీశ్‌ రెడ్డికి తనను విమర్శించే స్థాయి లేదని అన్నారు. జగదీశ్‌ రెడ్డి రేపో, మాపో జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. జగదీశ్‌ రెడ్డి లీడర్‌ కాదని కేసీఆర్‌ దగ్గర  బ్రోకర్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వేల ఓట్ల మెజార్టీతో బయటపడ్డ జగదీశ్‌ రెడ్డిది తనపై విమర్శలు చేసే స్థాయి కాదన్నారు. జగదీశ్‌ రెడ్డి హంతకుడు, దోపిడీదారు, అవినీతి పరుడని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్కూటర్‌ విూద తిరిగిన జగదీశ్‌ రెడ్డికి మెయినా బాద్‌ మండలంలో 80 ఎకరాల ఫాంహౌస్‌ ఎక్కడిదని ప్రశ్నించారు. నాగారంలో రూ. 60 కోట్లు పెట్టి ఇల్లు ఎలా కట్టారన్నారు. కేటీఆర్‌, హరీశ్‌ రావు, సంతోష్‌? రావుకు మతి భ్రమించిందని, మెంటల్‌ ఆస్పత్రికి పోవడం పక్కా అని అన్నారు. అవినీతి కేసుల్లో విచారణ జరుగుతోందని,ఎంతటి వారైనా ఉపేక్షించమని అన్నారు. ఎంపి ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఖాళీ కాబోతోందని, ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్కసీటు కూడా దక్కదని అన్నారు. బిఆర్‌ఎస్‌కు అబ్యర్థులు దొరకడం కూడా కష్టమేనని మంత్రి అన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు రెండు పథకాలను ప్రారంభించామని, వచ్చే నెల నుంచి 200 యూనిట్ల లోపు వినియోగదారులకు ఫ్రీ కరెంటును అమల్లోకి తెస్తామని అన్నారు. ప్రతి రోజూ దాదాపు రూ. 10 కోట్లు వెచ్చించి మహిళలకు ఉచిత బస్సు  ప్రయాణ సౌకర్యం కల్పించామని చెప్పారు. రెండు నెలల్లో సబ్సిడీపై గ్యాస్‌ సిలిండర్‌ అందించబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను నాశనం చేసిందని, నష్టాల ఊబిలోకి నెట్టేసిందని కోమటిరెడ్డి ఆరోపించారు.  82 ఏండ్ల యంగ్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌ రెడ్డిని సీఎండీగా నియమించిన ఘనత బీఆర్‌ఎస్‌ సర్కారుకే దక్కిందని చెప్పారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులు, చత్తీస్‌ గఢ్‌ నుంచి కరెంటు కొనుగోళ్లను నామినేషన్‌ పద్ధతిన కాంట్రాక్టుకు ఇచ్చి 70వేల కోట్ల రూపాయల నష్టం చేసిన పెద్దమనిషి ప్రభాకర్‌ రావు అని ఫైర్‌ అయ్యారు. ముఖ్యమంత్రి విూటింగ్‌ ఏర్పాటు చేసి రమ్మంటే ప్రభాకర్‌ రావు దాక్కున్నారని ఆరోపించారు. ఆయన ఎక్కడ దాక్కున్నా పోలీసులు వయస్సును చూడకుండా అరెస్టు  చేసి తీరుతారని చెప్పారు. 200 యూనిట్లలోపు ఉచితంగా కరెంటు ఇవ్వకపోతే తమ ఇంటికి వెళ్లాలని జగదీశ్‌ రెడ్డి మాట్లాడటంపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు కేసీఆర్‌ నిరుద్యోగులకు రూ. 3016 భృతి ఇస్తామని ప్రకటించారని, తాము  రెచ్చగొట్టి ఉంటే కేసీఆర్‌ ఫాం హౌస్‌ ఉండేదా..? అని ప్రశ్నించారు.
ఎన్నికల హావిూలను అమలు చేస్తున్నాం:మంత్రి శ్రీధర్‌బాబు
ఎన్నికల ముందు ఒక మంచి మేనిఫెస్టో అందించగలిగామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. మంగళవారం మంత్రి అధ్యక్షతన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో అన్నింటికంటే మంచి మేనిఫెస్టో ఇవ్వగలిగామన్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చామని.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేశామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రెండో రోజు మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యం, ఆరోగ్యశ్రీలో పది లక్షల ఆరోగ్య పథకాన్ని అందించామ న్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హావిూలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌ పార్టీపై ఎంతో విశ్వాసాన్ని చూపారన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని మండిపడ్డారు.  ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హవిూలను నేరవేర్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. హవిూల అమలుపై సవిూక్ష చేశామని.. వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హవిూ నేరవేరబోతుందన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందని విమర్శించారు. అందుకే హవిూల్లో కాస్త జాప్యం నడుస్తోందన్నారు. నిరుద్యోగ భృతి మొదలుకుని డబుల్‌ బెడ్‌ రూంల వరకు అన్ని హవిూలను బీఆర్‌ఎస్‌ విస్మరించిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాదన్నారు. మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి జైలుకు పోవడం ఖాయమన్నారు. కాళేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడిరచారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు.  కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇక, 200 యూనిట్ల కరెంట్‌..100 రోజుల్లో ఇచ్చి.. హావిూ నిలబెట్టుకుంటాం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో దళితుణ్ణి సీఎం చేస్తా అని చెప్పిన కేసీఆర్‌ ఏం చేశాడు.. దళితుణ్ణి సీఎం చేయకపోతే మెడ విూద తల నరుక్కుంటా అన్నాడు.. 9 ఏండ్లు తల నరుక్కున్నాడా..? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌ దోపిడీతో.. మేము ఇచ్చిన హావిూలు వెంటనే అమలు చేయలేకపోయామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తా అని కేసీఆర్‌ ఇవ్వలేదు.. నిరుద్యోగులను బీఆర్‌ఎస్‌ మోసం చేసింది.. పదేళ్లు వారికి ఉద్యోగాలు ఇవ్వకూండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.. ఇప్పుడు నిరుద్యోగులను కేసీఆర్‌ ఇంటికి పంపాలా.. కేటీఆర్‌ ఇంటికి పంపాలాఅని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ సర్కార్‌ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయ్యిందన్నారు. కేసీఆర్‌  నిరుద్యోగ  భృతి మొదలుకుని డబల్‌ బెడ్‌ రూంల వరకు అన్ని హవిూలను విూరు విస్మరించారన్నారు. మేము  ప్రజలను విూలాగా రెచ్చగొడితే ఫార్మ్‌ హౌస్‌ దాటకపోయే వారని హెచ్చరించారు.  పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు రాదని స్పష్టం చేశారు.  కాలేశ్వరంతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతొందన్నారు.