వజ్రోత్సవ వేడుకల ను కామారెడ్డి జిల్లా లొ ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్..

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్17 (జనంసాక్షి);
వజ్రోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ .తెలంగాణ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీమంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నాయకుడు మహమ్మద్ ఆలీ షబ్బీర్ ఈ సందర్భంగా స మాట్లాడుతూ
తెలంగాణ వజ్రోత్సవాలు జరుపుకునే హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు.చరిత్రలో లేని వారు అందులోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని షబ్బీర్ అలీ అన్నారు సర్దార్‌ పటేల్‌ నెహ్రు ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్నపుడు  సంస్థానాల విలీనం జరిగిందని గుర్తు చేశారు. దేశ చరిత్రతో బీజేపీకి, జన్‌సంఘ్‌కు ఎలాంటి  సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలోకి  దొంగతనంగా చొరబడేందుకు బీజేపీ, టిఆర్‌ఎస్‌ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ స్వతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు.తెలంగాణ ప్రజలకు వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపిన షబ్బీర్ అలీ ఎంతో మంది ఉద్యమకారుల వీరోచిత పోరాటమే
ఈ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలని చెప్పారు. అమరులను, వీరులను స్మరించుకుంటూ, వారి గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.తెలంగాణ అంటేనే కాంగ్రెస్ పార్టీ అని, భావ ప్రకటన స్వేచ్ఛ వచ్చిందంటే అప్పటి వీరుల త్యాగాలే దానికి కారణమన్నారు. వారి స్ఫూర్తిని తీసుకొని నిరంకుశత్వ పాలనకు నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. భూ స్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు లతో కలిసి పోరాటం చేశారని, బ్రిటిష్ స్వామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాలను మొదలుపెట్టారని గుర్తు చేశారు. బైరాంపల్లి వంటి ఘటనలు తెలంగాణాలో చాలా జరిగాయని, భూమి కోసం భుక్తి కోసం దండు కట్టి, దళంగా కదిలారని గుర్తు చేశారు. వేలాది మంది వీరులు పోరాటం చేసి తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదిస్తే కొందరు చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు.ప్రజల కోసం నడిపిన ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు ముక్తి భారత్ అని అంటున్నారని దేశంలో వందలాది సంస్థానాలున్నాయని, స్వాతంత్య్రం వచ్చాక కొన్ని సంస్థానాలు దేశంలో విలీనం అయ్యాయని, జునాఘడ్‌, హైదరాబాద్‌, జమ్మూ కశ్మీర్‌ వంటి సంస్థానాలను దేశంలో కలిసేలా చూడటంలో వల్లభ్‌ పటేల్ విజయం సాధించారని చెప్పారు.ముస్లిం రాజులు భారత్‌లో కలవకుండా పాకిస్తాన్‌లో కలుస్తామని బెట్టు చేస్తే వారిని భారత్‌లో కలిసేలా ఒప్పించడం వెనుక వల్లభ్‌ భాయ్‌ పటేల్ కృషి ఉందన్నారు. ఇప్పడు బీజేపీ నేతలు హిందువులు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు.అందె శ్రీ రాసిన పాటను రాష్ట్ర గీతంగా మారుస్తామని, సబ్బండ వర్గాల ప్రజల తల్లిగా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామన్నారు. దానికి నమూనా ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త రాష్ట్ర నిర్మాణం కోసం కవులు, కళాకారులు, యువత ఆలోచనలు పంచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు. గడుగు శీనివాస్.. గోనే శ్రీనివాస్ ఐరేని సందీప్. దాత్రిక సత్యం. పాత కృష్ణమూర్తి. జెపి వెంకటేష్. కారంగుల అశోక్ రెడ్డి మోత్కూరు శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ మహమ్మద్ సిరాజ్ దిన్ మహమ్మద్అన్వర్ షేరు తదితరులు పాల్గొన్నారు.