వడదెబ్బతో వ్యక్తి మృతి
వెంకటాపురం: రాష్ట్రంలో ఎండలు రోజుకు రోజుకు పెరిగి పోతున్నాయి. వేడిగాలులకు తట్టుకోలేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా వడదెబ్బకు గురై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన గోటి సమ్మయ్య(55) మృతి చెందాడు. శుక్రవారం కూలిపనికి వెళ్లి సొమ్మసిల్లి పడిపోయాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నించేలోపే అతను మృతి చెందా