వడ్డేపల్లి నూతన మున్సిపాలిటీ భవనం ను శాంతినగర్ లోనే నిర్మించాలి

-బిజెపి నాయకుల డిమాండ్.
గద్వాల నడిగడ్డ, జులై 29 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణాన్ని వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ పట్టణంలోని నిర్మించాలని బి జె పి పట్టణ ఉపాధ్యక్షుడు పైపాడు వెంకటేశ్వర్లు, మండలాధ్యక్షుడు నరసింహులు ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్ హాజరయ్యారు.
మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ జోగులాంబ
గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మున్సిపాలిటీ నూతన భవననిర్మాణాన్ని వడ్డేపల్లి లోని మాధవ స్వామి గుడి వెనుక భాగాన గుంతలలో నిర్మించతలపెట్టి ఉన్నారని మున్సిపాలిటీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనీ, మున్సిపాలిటీ పాలకవర్గం ఎలాంటి తీర్మానాలు లేకుండానే గుట్ట వెనుక భాగాన స్థలాన్ని పరిశీలించడం మున్సిపాలిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, పైపాడు, శాంతినగర్, వడ్డేపల్లి మున్సిపాలిటీ గ్రామాల ప్రజలు శాంతినగర్ అయితే బాగుంటుందని, వృద్ధులకు వికలాంగులకు ఇబ్బందికరంగా ఉంటుందని మున్సిపల్ సిబ్బంది ప్రజల అభిప్రాయం మేరకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా శాంతి నగర్ పట్టణంలో నూతన మున్సిపాలిటీ భవన నిర్మాణాన్ని చేపట్టాలని,
రాబోయే రోజులలో వడ్డేపల్లి మండల పరిధిలోని బుడమోరుసు, వెంకట్రామ నగర్( 26వ కాలువ ) జిల్లెడు దిన్ని గ్రామపంచాయతీలు వడ్డేపల్లి మున్సిపాలిటీలో విలీనం చెందే అవకాశాలు మెండుగా ఉన్నందున ఆ గ్రామ పంచాయతీ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అందరి సౌకర్యార్థం మేరకు మున్సిపాలిటీ పాలకవర్గం, చైర్మన్,కమిషనర్, ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించి మున్సిపాలిటీ ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా అందరి శ్రేయస్సు కోరుతూ శాంతి నగర్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని,
లేనిపక్షంలో బిజెపి పార్టీ తరఫున ఉద్యమం చేపడతామని ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
రాజకీయంతో పార్టీలతో సంబంధం లేకుండా ఈ విషయంలో అందరు ముందుకు రావాలని,గతంలో కట్టిన ప్రభుత్వ కార్యాలయాలు,విద్య సంస్థలు,
హాస్పిటల్, ప్రజల రాకపోకలకు అసౌకర్యంగా ఇబందికారంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఓబిసి మోర్చా మండలం అధ్యక్షుడు హాయ్ రాజు, మోహన్ ఉపాధ్యక్షుడు, రాజోలు మండలం కిసాన్ మోర్చా అధ్యక్షుల రమేష్, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.