వడ్డేపల్లి పి హెచ్ సి లో రక్తదాన శిబిరం

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 17 (జనం సాక్షి);
స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలలో భాగంగా సిఎం.కేసీఅర్ ఆదేశానుసారం బుధవారము వడ్డేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం ప్రారంభించారు.అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలతో పాటు, కెసిఆర్ కిట్టులను అందజేశారు.
ఈ సందర్భంగా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం మాట్లాడుతూ భారత దేశ స్వతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పేలా గ్రామగ్రామాన, వాడవాడలా.. అద్భుతంగా వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు ఘనంగా జరిగాయనీ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో పేదరికం ఒకటన్నారు. దేశం బాగుండాలంటే ప్రజలు బాగుండాలని,నిరుద్యోగం, మతత్వాన్ని సమూలంగా దేశం రూపుమాపాలని వెల్లడించారు. ప్రపంచానికి దిక్సూచిలా భారతదేశం ఎదగాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎంపిపి రజిత, వడ్డేపల్లి జెడ్పిటిసి కాశపోగు రాజు, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారాం రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత, టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సూరి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంకల శీను గౌడ్, కౌన్సిలర్ లు మాణిక్యం రవి, లత రవి, సర్పంచ్ లు ఆంజనేయులు, తిమ్మప్ప, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్‌ ప్రకాశ్ శీను పైపాడు మత్తు , తహసిల్దార్ లు జయరాముడు ,
సుబ్రహ్మణ్యం, ఎస్సైలు సంతోష్, లేనిన్, ఏఎస్ఐ మహేష్, ప్రజాప్రతినిధులు,
వైద్యులు,పోలీసు,మున్సిపల్ అధికారులు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.