వన్ ఫర్ వన్ స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో బాలికా దినోత్సవం
మల్దకల్ అక్టోబర్ 11(జనంసాక్షి)మల్దకల్ మండల పరిధిలోని పాలవాయి గ్రామంలో వన్ ఫర్ వన్ స్వచ్ఛంద సంస్థఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా మంగళవారం జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శివ రామిరెడ్డి,ఎంపిటిసి యశోదజీవన్ రెడ్డి హాజరయ్యారు.సంస్థ యొక్క అధ్యక్షురాలుసులామితమ్మ మాట్లాడుతూ బాలికల భవిష్యత్ గూర్చి ప్రోత్సాహించే బాధ్యత తల్లితండ్రులు, గురువులు సమాజం పై ఎంతైనా ఉంది.నేడు బాలికలు కూడా ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మనం వారిని ప్రోత్సాహించాలి. బాల్య వివాహాలు చేయకుండగా ఉన్నత చదువులు చదివించడం నైపుణ్యాబివృద్ది వంటి కోర్సుల్లో చేర్పించాలి. ఈకార్యక్రమంలో గ్రామసర్పంచ్ శివ రామిరెడ్డి,ఎంపీటీసీ యశోద జీవన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అయ్యపు రెడ్డి, జిహెచ్ఎం శ్రీనివాసులు, హెచ్ఎం కుసుమ లత, ఏఎన్ఎం మనోహరమ్మ, అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ, మల్లేశ్వరమ్మ ,రుద్రమ్మ,ఆశ వర్కర్లు సరోజమ్మ, పద్మమ్మ పీరమ్మ, సంస్థ అధ్యక్షులు సులామితమ్మ,జయంతుడు, సురేందర్.లక్ష్మీ, గ్రామప్రజలు విద్యార్థినులు పాల్గొన్నారు.