వరంగల్‌లో గుడిసెల తొలగింపు ఉద్రిక్తం
వరంగల్: హన్మకొండ సమ్మయ్యనగర్‌లో గుడిసెల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ భూముల్లో వెలిసిన గుడిసెల తొలగింపునకు ఈ ఉదయం అధికారులు చర్యలు చేపట్టారు. అయితే స్ధానికులు అధికారులను అడ్డుకొని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇక్కడ ముందుజాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు.