వరంగల్‌లో ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస
వరంగల్: ఛార్జీల పెంపుపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. ఐదు జిల్లాల ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసుల నిర్బంధం మధ్య విచారణ చేపట్టడంపై చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో విచారణ రెండు సార్లు వాయిదా పడింది. ఎంత చెప్పినప్పటికి వినకపోవడంతో నేతలను పోలీసులు అరెస్టు చేశారు. చేసిన వారిని విడుదల చేయాలని కార్యకర్తలు పోడియం ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.