వరంగల్ జిల్లాలో నాలుగో రోజు యాత్ర ప్రారంభం
వరంగల్ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా… మీకోసం ‘ పాదయాత్ర వరంగల్ జిల్లాలో నాలుగోరోజుకు చేరింది. నేటి యాత్రను కామరెడ్డిపల్లి క్రాస్ నుంచి చంద్రబాబు ప్రారంభించారు. ఎడమ కాలు చిటికెన వేలుకు తీవ్ర గాయంతో చంద్రబాబు బాధపడుతున్నప్పటికీ యాత్రను కొనసాగిస్తున్నారు.