వరంగల్ జిల్లాలో నేడు ఏడో రోజు పాదయాత్ర
వరంగల్ : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘ వస్తున్నా.. మీకోసం పాదయాత్ర వరంగల్ జిల్లాలో ఏడో రోజుకు చేరింది. నేటి యాత్ర సంగెం మండలం తిమ్మాపూర్‌లో ప్రారంభం కానుంది. గాంధీనగర్, తీగరాజుపల్లి, శ్రీనగర్‌క్రాస్, కొంకపాక క్రాస్, చౌటపల్లి క్రాస్, సోమవారం, జమాల్‌పూర్, గుంటూరుపల్లి మీదుగా పాదయాత్ర సాగనుంది. ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ చేపట్టిన 1468 కి.మీ పాదయాత్రను నిన్న చంద్రబాబు అధిగమించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమైన యాత్ర నిన్న సంగెం మండలం పల్లార్‌గూడ వద్ద 1500 కి.మీ మైలు రాయిని దాటింది.