వరంగల్ జిల్లాలో భారీ వర్షం -ఉప్పొంగుతున్న వాగులు
వరంగల్: జిల్లాలోని ములుగు ఏజెన్సీ, భూపాలపల్లిలో మంగళవారం తెల్లవారుజాము నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. భారీ వర్షానికి భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు నిలిచిపోవడంతో మూడు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మొరంతాబాద్ బొగ్గులవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.