వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు.. ఒకరి మృతి
వరంగల్ : అకాల వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట దెబ్బతింది. జనగాం, పరకాల, భూపాలపల్లిలో భారీ వర్షానికి కల్లాల్లో కంది, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. రేగొండలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడిన్నాయి. రేగొండలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడి గొర్రెల కాపరి మృతి చెందాడు. జనగాం మార్కెట్ యార్డులో రాత్రి కురిసిన వర్షానికి వెరుశనగ బస్తాలు తడిసిపోయాయి.