వరంగల్ జిల్లాలో యువతీయువకుల ఆత్మహత్యాయత్నం
వరంగల్ : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో పురుగుల మందు తాగి ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పేరుతో ఒక యువకుడు తనను వేధిస్తున్నాడని ఆమె పురుగుల మందు తాగగా నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై కేసు పెట్టారనే మనస్తాపంతో యువకుడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అతడిని కూడ ఆ నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.