వరంగల్ జిల్లా కలెక్టర్ ఘెరావ్
వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టరును గ్రామస్థులు ఘెరావ్ చేశారు. జిల్లాలోని హాన్మకొండ మండలం కడిపికొండలో అతిసార వ్యాపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి తీవ్రంగా ప్రబలినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఈ రోజు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో బాధితులను పరామర్శించడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జాను గ్రామస్థులు ఘెరావ్ చేశారు.