వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
వరంగల్ :వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నిక ఫలితాన్ని వాయిదా వేశారు. దీంతో రాఘవరెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను చెదగొట్టారు. ఛైర్మన్ పదవి కోసం నిర్ణీత సమయానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో జంగా రాఘవరెడ్డి ఛైర్మన్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అయితే ఆలస్యంగా హన్మకొండ డీసీసీబీ కార్యాలయానికి చేరుకున్న దొంతి మాధవరెడ్డి జంగా రాఘవరెడ్డిపై రౌడీషీట్ ఉందని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశరు. దీంతో ఛైర్మన్ ఎన్నిక ఫలితాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలియజేశారు.