వరంగల్ మున్సిపల్ అధికారులు ఓవర్‌ యాక్షన్‌

 3వరంగల్ : అవును పన్ను కట్టలేదని మున్సిపల్ అధికారులు ఇళ్లకు ఉన్న తళుపులను విరగ్గొట్టి తీసుకెళ్లారు. ఇది మరెక్కడో కాదు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు ఓవర్‌ యాక్షన్‌ చేశారు. ఇంటి పన్ను బాకీ ఉన్నారన్న కారణంతో.. ఇంటి తలుపులు విరగొట్టి లాక్కెళ్లారు. రెండు వేల రూపాయలకు మించి  బకాయిలు ఉన్న వారి ఇంటి తలుపులు తీసుకెళుతున్నారు. అయితే మార్చి 31వ తేదీ వరకు గడువున్నా అధికారులు మాత్రం బలవంతపు వసూళ్లకు  పాల్పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరోవైపు కమర్షియల్, షాపింగ్ ఎలాంటి ప్రామాణికత లేకుండా పన్నులు విధిస్తున్నారని ఆరోపించారు. అయితే మాల్యాలాంటి వాళ్లు ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతుంటే తమ లాంటిపట్ల ఇలా వ్యవహరించడం పై సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.