వరదపై సీఎం కేసీఆర్ సమీక్ష
– మృతులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా
– అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరిక
హైదరాబాద్,ఆగస్టు 31(జనంసాక్షి): హైదరాబాద్ నగరంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే అసాధారణ వర్షాలతో పాటు ఇంకా వర్ష సూచన ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల వల్ల ప్రాణనష్టంపై సిఎం కెసిఆర్‌గ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలకు 2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. సహాయకచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పోలీసు కమిషనర్లతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం పరిస్థితిని తెలుసుకున్నారు. బస్తీల్లోకి నీరు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు సహాయక చర్యల్లో పాల్గొనాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశించారు. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు ఎంప్పటికప్పుడు సమాచారం అందించడంతో పాటు అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం వేగంగా స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్, డ్రైనేజీ, రహదారులు, మ్యాన్¬ల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగర నలుమూలల నుంచి హుస్సేన్‌సాగర్‌కు భారీగా నీరు వచ్చి చేరుతోంది… అవసరాన్ని బట్టి నీరు విడుదల చేయాలని సీఎం చెప్పారు. నగరంలో వర్ష బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబానికి రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. భారీ వర్షానికి రామాంతాపూర్ ప్రగతినగర్‌లో ప్రహారీగోడ కూలి నలుగురు, బోలక్‌పూర్‌లో పాత ఇల్లు కూలి ముగ్గురు మృతిచెందిన సంగతి తెలిసిందే. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వర్షాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.మరో 24 గంటల పాటు వర్ష సూచన ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ, పోలీసు కమిషనర్‌తో వర్షాలపై సీఎం మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణతో పాటు సహాయక చర్యల్లో పాల్గొనాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్, డ్రైనేజీ, రహదారులు, మ్యాన్¬ల్స్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కంట్రోల్ రూమ్‌కు అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు సీఎం.