వరదసాయాన్ని అడ్డుకుంటారా!
– మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్,నవంబరు 21(జనంసాక్షి):వరదబాధితులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాయమందిస్తుంటే దానిని బీజేపీ నాయకులు అడ్డుకున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ పెద్దలు కొద్దిమంది కోసం 2 లక్షల 50 వేల కోట్ల రుణాలు కేంద్రం మాఫీ చేసిందన్నారు. కేంద్ర ఉద్యోగుల జీతం నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ రూపంలో జమ చేసుకున్న 54 వేల కోట్ల రూపాయలను వాడుకొని తిరిగి వాళ్లకు ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్స్ రూపంలో లక్షల మందికి కోట్ల రూపాయల పంపిణీ టి- సర్కార్ చేస్తోందన్నారు.వరద ముంపు ప్రజలను కేసీఆర్ సర్కారు ఆదుకుంటే బీజేపీ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. దేశ రాజధాని నగరంలో ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు పొల్యూషన్ కి ఉండలేక ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉందన్నారు. రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పాలించి రాజధానిలో ఉండలేని పరిస్థితికి తెచ్చారన్నారు. ప్రజా జీవనంలో 24 గంటల కరెంట్ లేకపోతే రోజువారీ ప్రయాణం సాఫీగా సాగుతుందాఅని ప్రశ్నించారు. సొంత ఎజెండాతో ప్రచారం చేస్తున్న పార్టీ టీఆరెస్ మాత్రమే….తెలంగాణ ప్రాంతానికి చెందిన 7 మండలాలను ఏపీకి ఇచ్చిన ఘనత జాతీయ పార్టీది….తెలంగాణ ఏర్పడినప్పడు తెలంగాణను కించపరిచినట్లు మాట్లాడిన నేత నేటి ప్రధాని మోడీ…జనం లేని సేనజనసేనా….సైన్యం లేని నాయకుడు పవన్ కళ్యాణ్…నోట్ల రద్దు అనేది సరైన నిర్ణయం కాదని అనేకమంది నిపుణులు అన్నారు- అంటున్నారు….బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఒక్కటైనా భారినీటి ప్రాజెక్టు కట్టారా అని అన్నారు. తాత్కాలిక ఆవేశానికి యువత లోను కావద్దన్నారు. టీఆర్‌ఎస్ లోకి వలసలు నిత్యకృత్యం అని ..ఇతర పార్టీ ల్లోకి వలసలు అపుడపుడు జరుగుతుంటాయన్నారు. మోడీ సర్కారు వన్నీ వైఫల్యాలే …ముంబై ,బెంగళూరు వరదలు వచ్చినపుడు అక్కడ ఓ రూపాయి సాయం చేశారా …హైదరాబాద్ లో మేము సాయం చేస్తే అడ్డుకుంటారా ?…సన్న వడ్ల రైతులను కచ్చితంగా ఆదుకుంటాం …హైదరాబాద్ అత్యంత నివాస యోగ్యమైన నగరాల్లో ముఖ్యమైనది ..పక్షి ఒక్కో కట్టె పుల్లను సేకరించి గూడు కట్టేందుకు కష్టపడ్డట్టే సీఎం కెసిఆర్ తెలంగాణ ఒక్కో రంగం అభ్యున్నతి కి తన జ్ఞాన సారాన్ని ధార పోస్తున్నారు ..తెలంగాణ వ్యతిరేకులు ఒక్కటవుతున్నరు …అన్ని సందర్భాల్లో ఎందరు కలిసినా టీఆర్‌ఎస్ నే ప్రజలు ఆదరించారు ..జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే విజయమని ధీమా వ్యక్తం చేశారు.