వరద బాధితులకు హర్భజన్‌ విరాళం


ఛండీఘర్‌ ,జూన్‌ 24 (జనంసాక్షి) :

ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు టీమిండియా క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌ విరాళం ప్రకటించాడు. తన వంతు సాయంగా 10 లక్షలు ఇస్తున్నట్టు చెప్పాడు. వరద వచ్చిన సమయంలో భజ్జీ కూడా అమర్‌నాథ్‌ యాత్రలో ఉన్నాడు. మిలిటరీ సిబ్బంది సహకారంతో ప్రమాదం నుండి బయటపడిన హర్భజన్‌ నాలుగురోజులు అక్కడే గడిపాడు. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన భజ్జీ ప్రకృతి ప్రళయంతో నష్టపోయిన వారికి తన వంతు సాయంగా ఐదేసి లక్షల చొప్పున ప్రధాని రిలీఫ్‌ ఫండ్‌కూ , ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ రిలీఫ్‌ ఫండ్‌కూ అందజేయనున్నట్టు చెప్పాడు. ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నట్టు తెలిపాడు.