వరసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర

qz6jiu02హైదరాబాద్‌ : డిమాండు తగ్గడంతో వరుసగా నాలుగోరోజూ బంగారం ధర తగ్గింది. రూ.175 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.26,400కు చేరింది. అంతర్జాతీయంగా సింగపూర్‌ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 1,123.03 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో డిమాండు తగ్గిందని దీంతో ఈ లోహం ధర తగ్గుతోందని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయిఈ రోజు వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.50 పెరగడంతో కేజీ వెండి ధర రూ.34,750కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు జరపడంతో దీని ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.