వర్గీకరణ చేయకుంటే బీజేపీ పార్టీని భూస్థాపితం చేస్తాం.

-ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలి.
-ఎంఆర్పీస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి గూట విజయ్ మాదిగ.
-6వ రోజు కొనసాగిన ఎంఆర్పీస్ రిలే నిరాహారదీక్షలు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 7 (జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు లో ఎంఆర్పీస్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి గూట విజయ్ మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా హామీలు ఇస్తూ మాట్లాడుతూ వచ్చి అధికారంలోకి వచ్చిన బిజెపి తర్వాత వర్గీకరణ పై మాట్లాడకుండా మౌనం వహిస్తూ తప్పించుకునే ధోరణి తో ముందుకు సాగుతుందని రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలోనే ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించకుంటే మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బిజెపి పార్టీని భూస్థాపితం చేస్తామని తెలిపారు.నమ్మించి గొంతు కోయడంలో బిజెపి పార్టీకి బాగా అలవాటు పడిపోయిందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నగన్నా, రామస్వామి, కొమ్ము మోహన్, బోనోసి రాజు,హుస్సేన్, బాలయ్య, రాములు శ్రీనివాస్