వర్తమానానికి కాళోజీ జీవితం స్ఫూర్తిదాయకం
– రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ప్రజల గొడవను తన గొడవగా మార్చుకొని నా గొడవ పేరుతో అద్భుతమైన రచనలు సృష్టించిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జీవితం వర్తమానానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.దివంగత ప్రజాకవి కాళోజి నారాయణ రావు 108వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ కాళోజీ యాదిలో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు.ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 9న తెలంగాణా అధికార భాషా దినోత్సవంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.