వర్షభీభత్సానికి కూలిన ఇండ్లను పరిశీలించిన తహసిల్దార్ మారుతి
14 జూలై (జనంసాక్షి) లింగంపేట్ మండలంలోని ఐలాపూర్ కొయ్యగుండు తాండ గ్రామపంచాయతీలలొ గురువారం కూలిన ఇండ్లను తహసీల్దార్ మారుతి పరిశీలించారు.గతవారం రోజుల నుండి విస్తారంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కూలీన నివాసపు ఇండ్లను ఆయన పరిశీలించారు.మండలంలోని వివిధ గ్రామాల్లో 36 ఇండ్లు పాక్షికంగా 3 ఇండ్లు పూర్తిగా కూలిపోయినట్లు ఆయన పేర్కొన్నారు.గ్రామంలో ప్రజలు శితిలవస్థ లొ ఉన్న ఇండ్లలొ నివసించవద్దని వారికి సూచించారు.కూలిపోయిన ఇండ్ల నివేధిక ను ఉన్నతాధికారులకు పంపింస్తామని ఆయన తెలిపారు.వర్షాలు పడ్డపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.వీరి వెంట రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య గ్రామ సర్పంచులు ధనలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి,లతరాందాస్ విఆర్ఏలు గ్రామస్తులు ఉన్నారు.



