వర్షానికి కూలిన తరగతి గది సెలవు దినం కావడంతో తప్పిన పెను ప్రమాదం

 

ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాల భవనం లోని ఓ తరగతి గది నేలమట్టమయింది . ఆదివారం పాఠశాలకు సెలవు కావడం వల్ల రాత్రి సమయంలోనే తరగతిగది కుప్పకూలడం తో పెను ప్రమాదం తప్పింది . కూలీల పాఠశాల గదిని చూసి స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు . విద్యార్థులు ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగితే ప్రాణం నష్టం తో పాటు , విద్యార్థులకు , ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలపాయాలయ్యేవారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు . ఈ పాఠశాలలో 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు మొత్తం 350 మంది విద్యార్థినిలుఉన్నారు . 5 తరగతులకు గాను 8 సెక్షన్లు ఉండగా 4 తరగతి గాదులు మాత్రమే ఉన్నాయి . ఇటీవల మన ఊరు మన బడి లో మూడు తరగతి గదులు మంజూరు కాగా పాత తరగతి గదులను కూల్చివేసి వాటి స్థలంలో కొత్త తరగతి గదులను నిర్మిస్తున్నారు . తరగతి గదుల కొరతతో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు అంటున్నారు .భాగ్యలక్ష్మి (ప్రధానోపాధ్యాయురాలు)ఆదివారం సెలవు దినం రోజున రాత్రి సమయంలో తరగతి గది కూలిపోవడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అన్నారు . మా పాఠశాలలో మూడు తరగతి గదుల నిర్మాణం జరుగుతుందని , ప్రస్తుతం నాలుగు గదులు ఉండేవని వాటిలో ఒకటి కూలిపోవడంతో మూడు తరగతి కాదులే మిగిలే అన్నారు . విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా యుపిఎస్ పాఠశాలలో మూడు తరగతి గదులను నడిపిస్తున్నామన్నారు . కూలిన తరగతిగది బాగానే ఉండేదని ఆమె తెలిపారు . ఏది ఏమైనా విద్యార్థులు లేని సమయంలో సెలవు రోజు రాత్రి సమయంలో తరగతి గది కూలిపోవడం విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడం మా అదృష్టంగా భావిస్తున్నామన్నారు .