*వర్షాల పై మంత్రి గంగుల సమీక్ష
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
* అన్ని శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండాలి
* రోడ్ల మీద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలి
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయని రోడ్ల మీద నీళ్ళు నిలువకుండా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు .
నేడు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి లతో కలిసి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు