*వర్షా కాల పంటలపై రైతులకు అవగాహన సదస్సు*

పెబ్బేరు జూలై 5 ( జనంసాక్షి ):  వర్షాకాలంలో పండించే పంటలపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు మంగళవారం బునియాదిపూర్ గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
 వానకాలం సాగుకు రైతులు  సమయతం కావాలని  చెప్పడం తెలిపారు.  భాస్వరం కరిగించి బ్యాక్టీరియా పైన, వరిలో వెదజల్లే పద్ధతి పైన మరియు ఎరువులను దపదపాలు గాను వాడుకున్న విషయం పైన రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ప్రస్తుతం మన నేలలు భాస్వరం చాలా ఎక్కువగా ఉందని దేనిగాను పాస్పో బ్యాక్టీరియా అనే జీవన ఎరువులు అందించడం వల్ల మొక్క వేర్లు పెరుగుదల మరియు మొక్క ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుందని తెలిపారు.   పాస్పో బ్యాక్టీరియా పశువుల పేడతో కలిపి చివరి దుక్కిలో గాని మరియు విత్తనం వేసిన పదిరోజుల్లో వేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని వస్తాయని వివరించారు. దానితోపాటు వాడవల్సిన అడుగు పిండి ఎరువులు  కొద్ది వరకు తగ్గించాలని అదేవిధంగా వరి వానకాలం  వెదజల్లే పద్ధతి ద్వారా గాని లేదా డ్రమ్స్ సీడర్ వెతుక్కోవడం వల్ల నాటు కూలీల ఖర్చు మరియు నారుమడి ఖర్చు తక్కువ అవడమే కాకుండా పంట త్వరగా కోతకు రావడం జరుగుతుంది. క్రిత సంవత్సరం బునియాదిపూర్ గ్రామంలో లక్ష్మణ్  అనే రైతు 28 క్వింటాలు, శ్యాంసుందర్ 35 క్వింటాలు  ఈ పద్ధతి ద్వారా దిగుబడి పొందడం జరిగిందని  అదేవిధంగా రైతులు ఈ పద్ధతి ని పాటించాలని కోరారు. ముఖ్యంగా ఎరువులను వరి పంటలు నాటు వేయు సమయంలో యూరియా  25 కిలోలు డిఏపి 50 కిలోలు పొటాషియం 15 కేజీలు వేసుకోవాలని సూచించారు. 30 రోజుల తర్వాతయూరియా 35 కే జి, పొట్ట దశలోయూరియా 25, పొటాషియం ఎరువు 20 కే జి  వేసుకోవాలని రైతులకు వ్యవసాయ  అధికారులు  అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో ఏఈఓ వి నరేష్ గ్రామ సర్పంచ్ గోవిందమ్మ , రైతుబంధు సమితి అధ్యక్షులు తిరుపతయ్య, విజయ్ గౌడ్, వెంకటేష్, అచ్చన్న , ఎల్ల స్వామి దస్తగిరి, రాముడు, లక్ష్మన్న, దాసు బాలరాజు , రాజు తదితరులు పాల్గొన్నారు.