వలిగొండ పంచాయితీ కార్యదర్శి బ్రహ్మచారి పై ధర్నా నిర్వహించిన బాధిత కుటుంబాలు

వలిగొండ జనం సాక్షి న్యూస్: వలిగొండ గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించి సస్పెండ్ అయిన బ్రహ్మచారి ఇంటి అనుమతులు మార్పిడి పేరును కట్టిన డబ్బులు వసూలు చేసి రసీదు ఇవ్వకుండా విధులనుండి తొలగించబడిన కార్యదర్శి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం మండల ప్రజా పరిషత్ వద్ద బాధితుల కుటుంబాలు ధర్నా నిర్వహించి ఎంపీడీవో లెంకల గీతారెడ్డికి  స్థానిక ఎస్సై ప్రభాకర్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి పట్టణ కార్యదర్శి గర్దాస్ నరసింహ కార్యవర్గ సభ్యులు కూర శ్రీనివాస్ సభ్యులు కే రామచంద్రన్ దుబ్బ లింగయ్య దానబోయిన యాదగిరి వేముల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు