వాంఖడేలో సిక్సర్ల వర్షం

– సన్‌రైజర్స్‌పై పొలార్డ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌

– 27 బంతుల్లో 66..  – ఏడు వికెట్ల తేడాతో విజయం

– ప్లే ఆఫ్‌కు చేరిన ముంబయి

ముంబై :

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ బౌలర్లపై ముంబైకి చెందిన పొలార్డ్‌ విరుచుకుపడ్డాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చీల్చి చెండాడాడు. దీంతో హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ పటేల్‌ 14 బంతుల్లో 26 (5 ఫోర్లు) చేసి మలింగ బౌలింగ్‌లో రాయుడికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సతీశ్‌ ధావన్‌ నిలకడగా ఆడి 41 బంతుల్లో 59 (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. జాన్సన్‌ బౌలింగ్‌లో షాట్‌ కొట్టబోయి కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విహారీ 37 బంతుల్లో 41 పరుగులు చేసి మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వైట్‌ 43, పెరారే 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ముంబై బౌలర్లలో మలింగ రెండు, జాన్సన్‌ ఒక వికెట్‌ తీశారు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో మూడు పరుగులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ స్మిత్‌ 17 బంతుల్లో 21 పరుగులు చేసి ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సచిన్‌ టెండుల్కర్‌ 31 బంతుల్లో 38 (3 ఫోర్లు, సిక్స్‌) చేశాడు. చేతికి దెబ్బ తగలడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కార్తీక్‌ 23 బంతుల్లో 30 పరుగులు చేసి శర్మ బౌలింగ్‌లో వైట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంబటి రాయుడు 5 బంతులు ఆడి 2 పరుగులకే స్టంపౌట్‌ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వచ్చీ రావడంతో చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 66 (2 ఫోర్లు, 8 సిక్స్‌లు) పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించి నాటౌట్‌గా నిలిచాడు. శర్మ 15 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో కరణ్‌శర్మ 2, ఇషాంత్‌ శర్మ ఒక వికెట్‌ తీశారు. కాగా, పొలార్డ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ లభించింది.వాంఖడేలో సిక్సర్ల వర్షం

– సన్‌రైజర్స్‌పై పొలార్డ్‌ విధ్వంసకర బ్యాటింగ్‌

– 27 బంతుల్లో 66..  – ఏడు వికెట్ల తేడాతో విజయం

– ప్లే ఆఫ్‌కు చేరిన ముంబయి

ముంబై :

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ బౌలర్లపై ముంబైకి చెందిన పొలార్డ్‌ విరుచుకుపడ్డాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చీల్చి చెండాడాడు. దీంతో హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ పటేల్‌ 14 బంతుల్లో 26 (5 ఫోర్లు) చేసి మలింగ బౌలింగ్‌లో రాయుడికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. సతీశ్‌ ధావన్‌ నిలకడగా ఆడి 41 బంతుల్లో 59 (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. జాన్సన్‌ బౌలింగ్‌లో షాట్‌ కొట్టబోయి కార్తీక్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విహారీ 37 బంతుల్లో 41 పరుగులు చేసి మలింగ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వైట్‌ 43, పెరారే 2 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ముంబై బౌలర్లలో మలింగ రెండు, జాన్సన్‌ ఒక వికెట్‌ తీశారు. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో మూడు పరుగులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ స్మిత్‌ 17 బంతుల్లో 21 పరుగులు చేసి ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. సచిన్‌ టెండుల్కర్‌ 31 బంతుల్లో 38 (3 ఫోర్లు, సిక్స్‌) చేశాడు. చేతికి దెబ్బ తగలడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కార్తీక్‌ 23 బంతుల్లో 30 పరుగులు చేసి శర్మ బౌలింగ్‌లో వైట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అంబటి రాయుడు 5 బంతులు ఆడి 2 పరుగులకే స్టంపౌట్‌ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వచ్చీ రావడంతో చెలరేగిపోయాడు. 27 బంతుల్లో 66 (2 ఫోర్లు, 8 సిక్స్‌లు) పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించి నాటౌట్‌గా నిలిచాడు. శర్మ 15 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట