వానొచ్చానంటే సెలవు వచ్చేను

-బంగారు తెలంగాణలో పట్టాలు కట్టి విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు

-చౌళ్ల తండా ప్రాథమిక పాఠశాల సొంత భవనం నిర్మించాలి

-సమస్యల కోరల్లో చిక్కుకున్న చౌళ్ల తండ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల
-పిడిఎస్యు జిల్లా కన్వీనర్ బానోత్ దేవేందర్

కురివి నవంబర్-11 (జనం సాక్షి న్యూస్)

ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యానందించడమే తమ లక్ష్యం అని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం కానీ ఇందుకు భిన్నంగా చౌళ్ల తండా ప్రాథమిక పాఠశాల భవనం ఉందని జిల్లా కన్వీనర్ భానో దేవేందర్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల బంగారిగూడెం గ్రామ పరిధిలోని చౌళ్లతండ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల సొంత భవనం ఏర్పాటు చేయాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో సూపర్డెంట్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా కన్వీనర్ బానోత్ దేవేందర్ మాట్లాడుతూ….చౌల తండా ప్రాథమిక పాఠశాల శిథిలావస్థలో ఉన్నప్పటికీ నూతన భవనం నిర్మించే విషయంలో అధికారులు దృష్టి సారించలేదు.భవనం పై కప్పు పెచ్చలు ఊడి పడడంతో విద్యార్థులు బిక్కు బిక్కు మంటూ విద్యనభ్యస్తున్నారు. బడికి వెళ్లిన పిల్లలకి ఎలాంటి అవాంచనీయ ఘటనతో ఇల్లు చేరుతారోనని తల్లిదండ్రులు భయభ్రాంతులకు ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయురాలు లత పాఠశాల భవనం వదిలేసి చెట్ల కింద పట్టాలు కట్టి దాని కింద విద్యాని బోధించే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడగానే భవనాలు కురవడం, గోడల మీద పెచ్చులు ఊడి పిల్లల పైన పడటం చాలా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.చౌళ్ల తండా మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థుల సంఖ్యకు సరిపడా టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలని, విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యం, చాలీచాలక నిధులతో మధ్యాహ్న భోజనాన్ని పెడుతున్నారని అధిక నిధులు కేటాయించింది నాణ్యతమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు మండల సహాయ కార్యదర్శి భుక్య నవీన్, నాయకులు అరవింద్, బాలు, ఈశ్వర్, లోకేష్, జైపాల్, తదితరులు పాల్గొన్నారు.