వామపక్ష విద్యార్థి సంఘంలో రాజేశ్వరరావు ప్రముఖ పాత్ర..

12036465_260314234319483_67స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు అనారోగ్యంతో మృతి.

సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు(93) కన్నుమూశారు. చెన్నమనేని గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈయన స్వస్థలం వేములవాడ మండలం మారుపాక గ్రామం.రాజేశ్వరరావు కుమారుడు రమేష్‌ ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు రాజేశ్వరరావు సోదరుడు.సీపీఐలో సుదీర్ఘకాలం పనిచేసిన చెన్నమనేని రాజేశ్వరరావు 1999లో టీడీపీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. రాజేశ్వరరావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

ప్రజల తరపున పోరాడిన మహానేత చెన్నమనేని. జీవితం మొత్తం కమ్యూనిస్ట్ పార్టీకి, ప్రజలకే అంకితం చేశారు. రైతు సంఘం నాయకుడిగా అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. విద్యార్థి దశలోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమంలో చెన్నమనేని పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాం వ్యతిరేక పోరాటంలో జైలు జీవితం అనుభవించారు.

1999లో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమసమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2004 తర్వాత క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు, ఆర్థిక నిపుణులు చెన్నమనేని హన్మంతరావు ఆయనకు సోదరులు. వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ రాజేశ్వరరావు ఆయన కుమారుడు.