వార్షిక రుణ ప్రణాళిక విడుదల
రంగారెడ్డి: వ్యవసాయంతో పాటు వ్యవసాయ ఆధారిత రంగాల అభివృద్ధి లక్ష్యంగా రుణప్రణాళిక ఉపయోగపడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాణీప్రసాద్ అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ రూపొందించిన రంగారెడ్డి జిల్లా వార్షిక రుణప్రణాళికను ఆమె ఆవిష్కరించారు. రూ. 4286కోట్ల రుణప్రణాళికలో వ్యవసాయ రుణాలతోపాటు, గృహ నిర్మాణం, విద్య, కోల్డ్‌స్టోరేజ్, సోలార్ విద్యుదుత్పత్తి, మార్కెట్ యార్డులు సహా వ్యవసాయాధిరత అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పారు.