*వాలీబాల్ టీం సభ్యులకు ఘనంగా సన్మానం.
చిట్యాల అక్టోబర్1 (జనంసాక్షి) మండలంలోని గిద్దేముత్తారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చిట్యాల మండల్ స్థాయిలో పోలీస్ దోస్తీ వాలీబాల్ పోటీలో వాలీబాల్ సెకండ్ ప్రైజ్ పొందిన గిద్దేముత్తారం గ్రామస్తుల వాలీబాల్ టీం సభ్యులను శనివారం సర్పంచ్ పోలవేని పోశాలు,గ్రామ ఎంపీటీసీ విజయలక్ష్మి సంజీవయ్య ఘనంగా శాలువా సన్మానం చేశారు. అనంతరం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని పోలీసులు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దోస్తీ క్రీడలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇలాంటి ఆటలకు మీ వెన్నంట ఉంటామని అన్నారు. అనంతరం క్రీడాకారులు వాలీబాల్ సెకండ్ ప్రైజ్ గ్రామపంచాయతీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నాగేంద్రబాబు, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు పంచిక మహేష్, ప్రభాకర్, తిరుపతి, రవి, సిద్దు, రమేష్, సమ్మయ్య, మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.