వాల్మీకి మహర్షి ఆదర్శనీయం
రాష్ట్ర వాల్మీకి ఐక్య కార్యచరణ స్టీరింగ్ కమిటీ సభ్యులు
పానుగల్ అక్టోబర్ 09,జనంసాక్షి
రామాయణం వంటి మహాగ్రంధాన్ని మానవాళికి అందించిన గొప్ప రచయిత వాల్మీకి మహర్షి ఆదర్శనీయమని రాష్ట్ర వాల్మీకి ఐక్య కార్యచరణ స్టీరింగ్ కమిటీ సభ్యులు రామ్మూర్తి నాయుడు,తుమ్మల రాములు, వెంకటయ్యనాయుడు,రఘుపతి నాయుడు అన్నారు, వాల్మీకి జయంతి పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంతో పాటు బండపల్లి, బుసిరెడ్డిపల్లి, కేతపల్లి, రేమద్దుల, అన్నారం, మాదరావుపల్లి, తదితర గ్రామాల్లో వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల లు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేతపల్లిలో వాల్మీకి మహర్షి విగ్రహానికి సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వాల్మీకి భవనానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషిద్ధాయకమన్నారు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు, అలాగే మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శ్రీధర్ రెడ్డి తాసిల్దార్ కార్యాలయంలో యేసయ్య వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి సర్పంచ్ అనిత, మాజీ సర్పంచ్ మహేష్ నాయుడు, నరసయ్య, రాజు, అభిమన్యుడు, యుగేందర్, సుధాకర్, ఆంజనేయుడు, రాముడు, నాగరాజుతదితరులు పాల్గొన్నారు.
Attachments area