వావ్‌ వాట్సన్‌

 

34 బంతుల్లో 70 పరుగులు

చెన్నైపై రాజస్థాన్‌ సూపర్‌ విజయం

జైపూర్‌ : జైపూర్‌లో ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  తొలుత బ్యాటింగ్‌ చేస ిన చెన్నై సూపరికింగ్స్‌ నిర్ణీత 20 ఓవ ర్లలో 4 వికెట్ల నష్టానికి 141 పరు గులు చేసింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్ధాన్‌ రాయల్స్‌ కేవలం 17.1 ఓవర్లలోనే ఛేదించింది. రాజస్ధాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. చెన్నై బ్యాటింగ్‌లో హస్సీ 40, విజయ్‌ 55, బ్రేవో 23, జడేజా 12 పరుగుల చేశారు. బౌలింగ్‌లో కూపర్‌ 2 వికెట్లు, బిన్ని ఒక వికెట్‌ తీశారు. రాజస్థాన్‌ బ్యాటింగ్‌లో వాట్సన్‌ 34 కేవలం బంతుల్లోనే 70 పరుగులు చేసి రాజస్థాన్‌ విజ యంలో కీలక పాత్ర పోషించాడు. రాజస్థాన్‌ బ్యాటింగ్‌లో ద్రావిడ్‌ 22, బిన్నీ 41, పరుగుల చేశారు. వాట్సన్‌ జోరుకు బిన్నీ అండగా నిలిచాడు ఇద్దరి భాగస్వామ్యాంలో రాజస్ధాన్‌ సునాయసంగా విజయాన్ని స్వంతం చేసుకుంది. చెన్నై బౌలింగ్‌లో హోల్డర్‌ 2 వికెట్లు, శర్మ, మోరిస్‌, బ్రేవో తలో వికెట్‌ తీశారు. బిన్నీ 23 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  రాజస్థాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన వాట్సన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ లభించింది.