విండీస్ టూర్‌కూ అదే జట్టు
న్యూఢిల్లీ : వెస్టిండీస్‌లో పర్యటించే టీమిండియాను జాతీయ ఎలక్షన్ కమిటీ పోమవారం ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు వీరెేందర్ సెవాగ్, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌లకు సెలక్టర్లు మరోసారి మొండిచేయి చూపించారు. మహీంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫిలో ఆద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలను మమూదు చేసి, సెమీ ఫైనల్స్ చేరింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేయడంతో టీమిండియా ప్రతిష్ట మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో, వెస్టిండీస్‌లో జరిగే ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌కు ఎలాంటి మార్పు చేయకూండా, ఆదే జట్టును కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించారు. ఈ టోర్నమెంట్‌లో భారత్, విండీస్‌తో పాటు శ్రీలంక కూడా ఆడుతుంది.
జట్టు వివరాలు: మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), శిఖర ధావాన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, దినేష్ కార్తీక్, మురళీ విజయ్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇశాంత్ శర్మ, అమిత్ మిశ్రా, వినయ్ కుమార్.