విఅర్ఎల న్యాయమైన డిమాండ్ లు వెంటనే నెరవేర్చాలి..

డిమాండ్ లు పరిష్కారం అయ్యే వరకు వి అర్ ఎ లు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దు..
– వారం రోజుల్లో సమస్య పరిష్కరించక పోతే బీజేపీ ఆద్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తాం
-బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి..
కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్19 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లాలొ
గత 57 రోజులుగా డిమాండ్ ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న వి అర్ ఎ లకు మద్దతుగా బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి అర్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఒక రోజు నిరాహార దిక్షా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు.ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ 57 రోజులగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని, ఒక వైపు సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో అని విఅర్ఎ ల ఆత్మహత్య చేసుకున్నప్పటికీ, రెండు నెలలు గ జీతాలు లేకున్నా సమ్మెలో పాల్గోటున్న న్యాయమైన డిమాండ్ లు వెంటనే నెరవేర్చి వారిని సమ్మెను విరమింపజేయాలనీ డిమాండ్ చేశారు. బడిగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారని, రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో రాజకీయం చేయటం హేయమైన చర్య అని అన్నారు. డిమాండ్ లు పరిష్కారం అయ్యే వరకు ఆత్మ స్థైర్యం కోల్పోవద్దని అన్నారు.
వారం రోజుల్లో వి అర్ ఎ ల సమస్య పరిష్కరించక పోతే బీజేపీ ఆద్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలు శ్రీనివాస్, జిల్లా ఉపాద్యక్షుడు వెంకట రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, మండలాల అధ్యక్షులు గంగారెడ్డి, చారి, రాజేష్, పట్టణ అధ్యక్యుడు విపుల్, కౌన్సిలర్ లు శ్రీకాంత్, శ్రీనివాస్, ప్రవీణ్, నరేందర్, రవి, మానస నాయకులు సురేష్, దాట్టేశ్వరి, హారిక, బలమని, ఆనందరావు, నక్క రాజు, శ్రీధర్, లతో పాటు 250 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.