విఆర్ఎల రిలే నిరసన దీక్ష

మోత్కూరు జూలై 26 జనంసాక్షి : మండల కేంద్రంలో మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో విఆర్ఎలు రిలేదీక్షా చేపట్టారు. విఆర్ఎల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసనలో బాగంగా రెండవ రోజు రిలే దీక్షా చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా విఆర్ఎల సమస్యలు తీర్చాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్ఎ లకు ఫేస్కేల్ అమలుచేయాలని, 55 సంవత్సరాలు పైబడ్డ వారికి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. రెండో రోజు కొనసాగిస్తున్న సమ్మె కు సీపీఎం పార్టీ జిల్లా నాయకులు బొల్లు యాదగిరి సంగీబావం తెలిపి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విఆర్ఎ లకు పే స్కేల్ అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో గ్రామ రెవిన్యూ సహాయకుల జిల్లా కో కన్వీనర్లు, ఆకుల సైదులు,ముక్కర్ల రవి, మహిళ కో కన్వీనర్లు మాధవి ప్రధాన సలహాదారులు, శ్రీకాంత్,సంపథయ్య, మండల అ్యక్షులు సూరారం యాదయ్య, ఉపాద్యక్షులు యాకు, కార్యదర్శులు శ్రీను,నూర్, కోశాధికారి ఉమ,కిషోర్, ప్రచార కార్యదర్శులు బోళ్ల సైదులు, బలరాములు, మత్యగిరి, రజినీకాంత్ పాల్గొన్నారు.