విఆర్ఎల సమ్మెకు సంఘీభావంగా ఆర్థిక సహాయం చేసిన బీర్ల ఐలయ్య

 

ఆత్మకూరు(ఎం) ఆగస్టు 15 (జనంసాక్షి) ఆత్మకూరు మండల కేంద్రంలో విఆర్ఎల హక్కుల సాధనకు నిరవధిక సమ్మె చేస్తున్న గ్రామ సేవకుల విఆర్ఎల న్యాయమైన హక్కులను కాపాడాలని సీఎం కెసిఆర్ వారికి ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయాలని కోరుతూ ఆలేరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య వారి తరపున ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం జెడ్పీటీసీ నరేందర్ గుప్తా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి మరియు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల చేతుల మీదుగా సమ్మె చేస్తున్న గ్రామ సేవకులకు బీర్ల ఫౌండేషన్ పది వేల రూపాయల నగదును అందచేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులకు ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉండే గ్రామ సేవకుల విఆర్ఎల సమ్మెను కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వారి పాలన దక్షతకు నిదర్శనం అని వారి సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జన్నాయికోడె నగేశ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దీగోజు నర్సింహాచారీ ఉప సర్పంచ్ దొంతరబోయిన నవ్య భాస్కర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతాగాని మల్లేష్ ఓబీసీ సెల్ అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య ఎస్సి సెల్ అధ్యక్షులు నగేశ్ మండల నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యుఐ నాయకులు పాల్గొన్నారు