విఆర్ఎ అంత్యక్రియలకు పది వేలు అందించిన తహశీల్దార్
నేరడిగొండఅక్టోబర్12(జనంసాక్షి) :మండలోని బుద్దికొండ గ్రామానికి చెందిన విఆర్ఎ కైరునిషా బేగం అనారోగ్యంతో మానసికంగా బాధపడుతూ మంగళవారం రోజున తుదిశ్వాస విడిచారు.వారి అంత్యక్రియల కొరకు బుధవారం నాడు తహసీల్దార్ పవన్ చంద్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ తరుపున10వేలు రూపాయల తోపాటు ఆదిలాబాద్ జిల్లా విఆర్ఏ జెఎసి తరుపున 5వేలు రూపాయలు వారి కుటుంబ సభ్యులకు అందజేసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఇట్టి సందర్భంలో మండల రెవెన్యూ అర్ఐ నాగోరావ్ విఆర్ఏ జేఏసీ జిల్లా అధ్యక్షులు అజిజ్ ఖాన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేంసాగర్ ఉపధ్యక్షులు సలీం కో కన్వినర్ మండలం అధ్యక్షులు పెద్దులుతదితరులు హాజరయ్యారు.
Attachments area