విఆర్ఎ ల నిరాహారదీక్ష కు బిజెపి నాయకులు మద్దతు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు9(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఎ తమ డిమాండ్ల పరిష్కారం కోసం లు గత 16 రోజుల నుండి నిరాహారదీక్షలు చేపట్టారు.మంగళవారం బిజెపి నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి విఆర్ఎ ల కు సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడనూరి దిలీప్ చారి మాట్లాడుతూ భారతీయ విఆర్ఎ ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కెసిఆర్ తన జీవితాన్ని పెంచుకున్నారు కానీ ఈ యొక్క వీఆర్ఏల జీతాలను పెంచడం లేదన్నారు.రాష్ట్రంలో సరైన సమయానికి ఉద్యోగస్తుల కు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. కెసిఆర్ కేవలం తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నారు కానీ బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు.తెలంగాణలో అందర్నీ మోసం చేసినట్లే విఆర్ఎ లను కూడా మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఎ న్యాయమైన డిమాండ్లను అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది.అధికారంలోకి వచ్చిన వెంటనే వారి డిమాండ్లను అమలు చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బుసి రెడ్డి సుధాకర్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు ఎలిమి రాము, నరేంద్ర చారి, లోహిత్ రెడ్డి,యశ్వంత్,జిల్లా నాయకులు నారాయణ చారి, రాజేశ్వర్ రెడ్డి, వంకేశ్వరం రాము, చికొండ్ర చందు, బొట్టు శ్రీను, సైదులు, బీజేవైఎం నాయకులు సంతోష్ కుమార్, చందు, శివ,తదితరులు పాల్గొన్నారు.