విఆర్ఏలకు సంఘీభావం తెలిపిన బిజెపి నాయకులు

లింగంపేట్   జూలై (జనంసాక్షి)
 విఆర్ఏల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని మంగళవారం లింగంపేట్ బిజెపి శాఖ ఆధ్వర్యంలో విఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతుగా భారతీయ జనత పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా లింగంపేట్ బిజెపి మండల అధ్యక్షుడు జక్సాని దత్తురాం మాట్లాడుతు ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా విఆర్ఏలకు పే స్కేల్ అమలుచేస్తు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి కాలయాపన చేయడం సరికాదన్నారు.వారి సమస్యలను వెంటనే నెరవేర్చాలని లింగంపేట్ భారతీయ జనతాపార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వడ్ల రాంచందర్ బొల్లారం సాయిలు పెద్ద శివయ్య తల్వార్ అల్లూరి విఆర్ఏలు ఉన్నారు.
 
Attachments area