విఆర్ఏల నిరసనకు మద్దతు తెలిపిన టీఎస్ యుటిఎఫ్
కొడకండ్ల, ఆగస్ట్08(జనం సాక్షి):
కొడకండ్ల మండల కేంద్రంలోని తహశీల్ధారు కార్యాలయం ముందు విఆర్ఏల నిరవధిక సమ్మె 15 వ రోజుకి చేరింది.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వీఆర్ఏ ల నిరవధిక సమ్మె లో భాగంగా మండల కేంద్రంలో సోమవారం రోజున తహశీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల 15వ రోజు నిరవధిక సమ్మెకు
రాష్ట్ర యూటీఎఫ్ ఆదేశాల మేరకు కొడకండ్ల మండల యూటీఎఫ్ అధ్యక్షుడు పి. వెంకటాద్రి మరియు ఇతర నాయకులు ఎస్డీ. మొయిజుద్దీన్, వి. సోమయ్య లు వి.ఆర్ ఏ ల సమ్మెకు మద్దతు తెలిపారు.అనంతరం యూటీఎఫ్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చినా హామీలను వెంటనే నెరవేర్చాలని,పేస్కెల్ జీవో వెంటనే జారీ చేసి అమలు చేయాలని,
55 ఏళ్ళు నిండిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని
కోరారు.ఈ కార్యక్రమములో విఆర్ఏ-జేఏసీ సభ్యులు పాల్గొన్నారు.
|