విఆర్ఏల హామీలు అమలు చేయాలి

. టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యవర్గ సభ్యులు బేతమల్ల సహదేవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కురవి సెప్టెంబర్ -3
(జనం సాక్షి న్యూస్)

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విఆర్ఏ లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కార్యవర్గ సభ్యులు బేతమల్ల సహదేవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విఆర్ఏ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కురవి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరవధిక దీక్ష కు శనివారం జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో పర్శబోయిన మహేష్, గండమల్ల రోశయ్య, పేరాల ఉపేందర్, కొప్పుల శ్రీనివాస్, అమెడ నాగరాజులతో పాటు మరి కొంతమంది జర్నలిస్టులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సహదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేస్కేల్ , అర్హుల కు ప్రమోషన్స్ కల్పిస్తానని,55 సంవత్సరం లు నిండిన విఆర్ఏ వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 41రోజులుగా దీక్షలు చేపడుతున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదని, ప్రభుత్వం మొద్దునిద్ర వదిలి విఆర్ ఎలా హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల విఆర్ ఎలు చేపడుతున్న పోరాటాలకు మద్దతు ఇస్తామని అన్నారు. ఈ దీక్షలో మండల జేఏసీ అధ్యక్షుడు రెంటలా చెంద్రశేకర్, ఉపాధ్యక్షుడు తురక వెంకటేష్ , కో కన్వీనర్ బాజా వెంకన్న ,బిస్మిల్లా ‘కోశాధికారి గంగారబోయిన కృష్ణ, గ్రామాల విఆర్ ఏ లు గంగిశెట్టి వినయ్, సరిత, సుజాత , జ్యోస్న , పుష్ప,నాగరాజు,రాము,రమేష్, ఇస్మాయిల్,అశోక్, సుధాకర్,ప్రభు,వెంకటేష్ , రామచంద్రు,విజయ్,వెంకన్న తదితర వి ఆర్ ఏ లు పాల్గొన్నారు.